సీఎం రమేష్ ఇళ్లల్లో సోదాలపై కనకమేడల కామెంట్స్

By ramya NFirst Published Apr 5, 2019, 12:15 PM IST
Highlights

సీఎం రమేష్ ఇళ్లలో శుక్రవారం ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ దాడులపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ స్పందించారు.

సీఎం రమేష్ ఇళ్లలో శుక్రవారం ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ దాడులపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ స్పందించారు. ఎవరి ఆదేశాలతో సీఎం రమేష్ ఇంట్లో సోదాలు చేశారని ప్రశ్నించారు. సాధారణ తనిఖీలేనని పోలీసులు చెబుతున్నారని.. అయితే.. ఇవే దాడులు జన్, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇళ్లల్లో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు.

సాధారణ దాడులైతే అన్ని పార్టీల అభ్యర్థుల ఇళ్లపై చేయాలే గానీ ఒకే పక్షం అభ్యర్థులపై ఎందుకు? అని ప్రశ్నించారు. ఇటీవల ఉగ్రనరసింహరెడ్డి, బీద మస్తాన్‌రావు, పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇళ్లపైనా దాడులు చేశారని.. వీటిని ఏ కోణంలో చూడాలని ప్రశ్నించారు. ఇందులో కచ్చితంగా కుట్ర కోణం దాగి ఉందని తేల్చి చెప్పారు. 

వైసీపీలోనూ నేరస్థులు చాలా మంది ఉండగా.. రకరకాల వ్యాపారాలు చేస్తున్న వారిపై ఐటీ దాడులు ఎందుకు జరపడం లేదని ధ్వజమెత్తారు. ఈ ధోరణి ఓటర్లకు ప్రత్యక్షంగా సంకేతాలు పంపడమేనని అన్నారు. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే ఐటీ అధికారులను ప్రశ్నించాల్సి ఉందని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని అభిప్రాయపడ్డారు.

click me!