జగన్, విజయమ్మ, షర్మిల సభల్లో ఘర్షణలు... వైసీపీ నెక్ట్స్ ప్లాన్ ఇదే: బుద్ధా

Siva Kodati |  
Published : Apr 05, 2019, 12:27 PM ISTUpdated : Apr 05, 2019, 12:29 PM IST
జగన్, విజయమ్మ, షర్మిల సభల్లో ఘర్షణలు... వైసీపీ నెక్ట్స్ ప్లాన్ ఇదే: బుద్ధా

సారాంశం

ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అత్యంత ధనవంతులని మరి వారిపై ఎలాంటి దాడులు చేయరేంటని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.

ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అత్యంత ధనవంతులని మరి వారిపై ఎలాంటి దాడులు చేయరేంటని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఇళ్లపై ఐటీ దాడులను నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమం అనంతరం బుద్ధా మాట్లాడుతూ.. ఎన్నికలకు కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా హైదరాబాద్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులును కేసీఆర్ బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

మోడీ, జగన్‌లకు ఓటమి భయం పట్టుకుందని జనం చంద్రబాబు వైపున్నారని వారికి కంగారుగా ఉందంటూ బుద్దా ఎద్దేవా చేశారు. రెండు, మూడు రోజుల్లో జగన్, విజయమ్మ, షర్మిల సభల్లో తెలుగుదేశం కార్యకర్తల ముసుగులో వైసీపీ మనుషులను పంపించి అక్కడి వారిపై జగన్ దాడులు చేయించుకుని సానుభూతి పొందేందుకు కుట్ర పన్నుతున్నారని వెంకన్న ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు