స్టార్ హోదాను మరిచి సామాన్యుడిలా పవన్ కల్యాణ్...మట్టిగిన్నెలో భోజనం (వీడియో)

Published : Mar 24, 2019, 08:16 PM ISTUpdated : Mar 24, 2019, 08:17 PM IST
స్టార్ హోదాను మరిచి సామాన్యుడిలా పవన్ కల్యాణ్...మట్టిగిన్నెలో భోజనం (వీడియో)

సారాంశం

జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి తన సింప్లీసిటీని చాటుకున్నారు. స్టార్ హోదాను మరిచి అతి సామాన్యుడిలా తాటాకు చాపపై కూర్చుని భోజనం చేశారు. ఈ అరుదైన సన్నివేశం కృష్ణా జిల్లా ప్రచారంలో భాగంగా ఆవిష్కృతమైంది.   

జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి తన సింప్లీసిటీని చాటుకున్నారు. స్టార్ హోదాను మరిచి అతి సామాన్యుడిలా తాటాకు చాపపై కూర్చుని భోజనం చేశారు. ఈ అరుదైన సన్నివేశం కృష్ణా జిల్లా ప్రచారంలో భాగంగా ఆవిష్కృతమైంది. 

కృష్ణా జిల్లాలలో జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తూ అలసిపోయిన పవన్ కల్యాణ్ కాస్సేపు సేదతీరడానికి మ‌చిలీప‌ట్నం స‌మీపంలోని మంగిన‌పూడి లైట్ హౌస్ వ‌ద్ద ఓ చెట్టు కిందకు చేరారు. అక్కడ ఓ తాటాకు చాపను కింద పర్చుకుని కూర్చున్నారు. ఆ తర్వాత అక్కడే అతి సామాన్యుడి మాదిరిగా, పల్లెటూళ్లలో నిరుపేదలు తినే ఆహారాన్ని ఓ మట్టికుండలో తీసుకున్నారు. జొన్నఅన్నం, మ‌జ్జిగ‌లో క‌లుపుకొని ప‌చ్చిమిర‌ప‌కాయ ప‌చ్చ‌డితో నంజుకొని తిన్నారు. 

భోజనం అనంతరం అదేమ వేప‌చెట్టు కింద తాటాకు చాప‌ల‌పైనే సేద‌తీరారు. ఈ పల్లెటూరి వాతావ‌ర‌ణం ఎంతో ఆహ్లాదం క‌లిగించ‌డంతో ఇక్కడ ఇలా సామాన్యుడిలా  మారిపోయినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు