యజమానికి సరైన సర్వీస్ ఇవ్వలేకే ఉన్మాదిలా పవన్ కల్యాణ్: విజయసాయి రెడ్డి

By Arun Kumar PFirst Published Mar 24, 2019, 5:27 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల రాజకీయాలు సమ్మర్ హీట్ ను మించి  వేడెక్కుతున్నాయి. ప్రముఖ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. పార్టీల అధ్యక్షులే ఒకరిపై ఒకరు తీవ్ర దూషణలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటుంటే తామేమీ తక్కువ కామంటున్నారు ఇతర నాయకులు. ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి లోకేశ్ లపై మొదటినుండి బహిరంగంగానే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ విరుచుకుపడుతున్న వైఎస్సార్‌సిపి నేత విజయసాయి రెడ్డి తాజాగా జనసేన అధినేతపై తీవ్ర విమర్శలకు దిగారు. 
 
జనసేన పార్టీ పేరుతో పవన్ కల్యాణ్ టిడిపి అనుబంధ పార్టీని  నడుపుతున్నాడని తీవ్రంగా విమర్శించారు. విజయ సాయి రెడ్డి వరుస ట్వీట్ల ద్వారా ఈ విధంగా విమర్శలకు దిగారు.  ''పవన్ కల్యాణ్ గారి ఉన్మాదం కట్టలు తెంచుకుంది. ప్యాకేజీ ముట్ట చెప్పిన యజమానికి సర్వీస్ ఇవ్వలేక పోతున్నానని టెన్షన్ పడుతున్నాడు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టయినా చంద్రబాబు కళ్లలో ఆనందం చూడాలనుకుంటున్నాడు. ఇద్దరు కలిసినా,ఇంకో నలుగురు వచ్చినా ఫలితం ఏక పక్షంగా ఉంటుంది.'' అన్నారు. 

మరో ట్వీట్ లో '' “హిజ్ మాస్టర్స్ వాయిస్” పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో కలిసి పోటీ చేస్తున్న పార్టీలకు ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్టే.అంటే వృథా అయినట్టే. ప్యాకేజీలు తీసుకుని ఎన్నికల వేళ వచ్చిపోయే పార్టీలకు, నాయకులకు గట్టి గుణ పాఠం చెప్పాలి. ఇంకో సారి ప్రజల ముందుకు రావడానికి భయపడేలా తీర్పు ఉండాలి.'' అంటూ పవన్ టిడిపి అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు.

''జనసేన, బిస్పీపీ, సిపిఐ,కాంగ్రెస్ అభర్థుల జాబితా చంద్రబాబే తయారు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి నిధులు సమకూర్చి బరిలోకి దించుతున్నారు. ఇదంతా 30-40 ఏళ్ల కిందటి పనికి రాని ఫార్ములా. చిల్లర పార్టీలకు ఓటేసి తమ హక్కును వృథా చేసుకునేంత అమాయకులేం కాదు ప్రజలు'' అంటూ వైఎస్సార్‌సిపి విజయంపై విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 
 
click me!