ఇడుపులపాయకు చేరుకున్న జగన్, కాసేపట్లో జాబితా విడుదల

Siva Kodati |  
Published : Mar 17, 2019, 10:18 AM IST
ఇడుపులపాయకు చేరుకున్న జగన్, కాసేపట్లో జాబితా విడుదల

సారాంశం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఇడుపులపాయ చేరుకున్నారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఇడుపులపాయ చేరుకున్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆయన 10.26 గంటలకు శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.

అనంతరం ఇడుపులపాయ నుంచి ఆయన విశాఖ చేరుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇప్పటికే వైసీపీ నుంచి పోటీ చేసే 9 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, మరో 16 లోక్‌సభ స్థానాలు, 175 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు