నా కొడుకు పోటీ చేయడం లేదు: రాయపాటి

Published : Mar 17, 2019, 08:44 AM IST
నా కొడుకు పోటీ చేయడం లేదు: రాయపాటి

సారాంశం

నా కొడుకు పోటీ చేయడం లేదని నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. కుటుంబంలో ఒక్కరికే టిక్కెట్టు కేటాయిస్తామని  టీడీపీ నాయకత్వం హామీ ఇచ్చినందున తాను మాత్రమే పోటీ చేస్తున్నట్టుగా రాయపాటి సాంబశివరావు తేల్చి చెప్పారు.

తిరుపతి: నా కొడుకు పోటీ చేయడం లేదని నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. కుటుంబంలో ఒక్కరికే టిక్కెట్టు కేటాయిస్తామని  టీడీపీ నాయకత్వం హామీ ఇచ్చినందున తాను మాత్రమే పోటీ చేస్తున్నట్టుగా రాయపాటి సాంబశివరావు తేల్చి చెప్పారు.

ఆదివారం నాడు ఉదయం నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దఫా ఎన్నికల్లో తన కొడుకు పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలోని 150 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన చెప్పారు. రాయపాటి సాంబశివరవు కొడుకు రంగబాబుకు సత్తెనపల్లి అసెంబ్లీ టిక్కెట్టు కోరాడు. అయితే ఈ స్థానం నుండి స్పీకర్ కోడెల శివప్రసాదరావు రెండో దఫా పోటీకి దిగారు.ఈ తరుణంలో రంగబాబుకు టిక్కెట్టు కేటాయించలేమని బాబు స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు