బాబాయ్ మరణం కూడ రాజకీయం కోసమే: జగన్ పై బాబు

Published : Mar 17, 2019, 10:15 AM IST
బాబాయ్ మరణం కూడ రాజకీయం కోసమే: జగన్ పై బాబు

సారాంశం

స్వంత బాబాయ్ మరణాన్ని కూడ రాజకీయాల కోసం జగన్ ఉపయోగించుకొంటున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు.  

అమరావతి: స్వంత బాబాయ్ మరణాన్ని కూడ రాజకీయాల కోసం జగన్ ఉపయోగించుకొంటున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు.

ఆదివారం నాడు ఉదయం చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ కాన్పరెన్స్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బాబు ప్రసంగించారు.  ప్రజల ముందు వైసీపీ తప్పుడు ఎజెండాను పెడుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల  నుండి ప్రజల దృష్టిని మరలించే ప్రయత్నం చేస్తోందన్నారు.

ఎన్నికల ముందు ఆయారాం, గయరాంలు సహజమన్నారు. పొలిటికల్ కంపల్షన్ వల్లే కొందరిని పార్టీలో చేర్చుకోవాల్సి వచ్చిందన్నారు.  అయితే కొందరి వల్ల పార్టీకి ప్రయోజనం కలగలేదన్నారు. పార్టీలో చేరినవారిలో కొందరు మోసం చేశారని బాబు ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు