15 మందితో టీడీపీ రెండో జాబితా: అభ్యర్థులు వీరే

By narsimha lodeFirst Published Mar 17, 2019, 8:04 AM IST
Highlights

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి చంద్రబాబునాయుడు ఈ జాబితాను విడుదల చేశారు.
 


అమరావతి:టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి చంద్రబాబునాయుడు ఈ జాబితాను విడుదల చేశారు.

రెండు రోజుల క్రిత తొలి జాబితాను విడుదల చేశారు.  తొలి జాబితాలో 126 మందికి టిక్కెట్లను కేటాయించారు. రెండో జాబితాలో 15 మందికి స్థానం దక్కింది. మిగిలిన అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.

మడకశిరలో సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలకు టిక్కెట్టు నిరాకరించారు.ఆమె స్థానంలో ఈరన్నకు బాబు చోటు కల్పించారు. తాడిపత్రి నుండి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డికి చోటు దక్కింది.రంపచోడవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేశ్వరీకే బాబు సీటు ఇచ్చారు.

టీడీపీ అభ్యర్థులు వీరే
 

1. పాలకొండ- నిమ్మల జయకృష్ణ
2. పిఠాపురం- ఎన్‌వీఎస్‌ఎన్‌ వర్మ
3. రంపచోడవరం- వంతల రాజేశ్వరి
4. ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు
5. పెడన- కాగిత వెంకటకృష్ణ ప్రసాద్‌
6. పామర్రు- ఉప్పులేటి కల్పన
7. సూళ్లూరుపేట- పరసావెంకటరత్నం
8. నందికొట్కూరు- బండి జయరాజు
9. బనగానపల్లె- బిసి జనార్దన్‌రెడ్డి
10. రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు
11. ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌
12. తాడిపత్రి- జేసీ అస్మిత్‌రెడ్డి
13. మడకశిర- కె.ఈరన్న
14. మదనపల్లి- దమ్మాలపాటి రమేష్‌
15. చిత్తూరు- ఏఎస్‌ మనోహర్‌

సంబంధిత వార్తలు

126 మందితో టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల

 

 

click me!