ప్రచారానికి సన్ స్ట్రోక్: ఎండదెబ్బకు ఆస్పత్రి పాలవుతున్న అభ్యర్ధులు

By Siva KodatiFirst Published Apr 2, 2019, 10:38 AM IST
Highlights

పోలింగ్‌కు పట్టుమని 8 రోజులే ఉండటంతో నేతలు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే భానుడి ప్రతాపానికి వారు తట్టుకోలేకపోతున్నారు. మండుటెండల్లో ప్రచారం చేస్తుండటంతో చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు.  

పోలింగ్‌కు పట్టుమని 8 రోజులే ఉండటంతో నేతలు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే భానుడి ప్రతాపానికి వారు తట్టుకోలేకపోతున్నారు. మండుటెండల్లో ప్రచారం చేస్తుండటంతో చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు.  

కార్లలో ఏసీలు, జేబుల్లో గ్లూకోజ్ ప్యాకెట్లు, నెత్తికి రుమాళ్లు, టవళ్లు కట్టుకుని ప్రచారానికి వెళ్తున్నా కొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు. కృష్ణాజిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడే ప్రసాద్ ఎండలో ప్రచారం చేయడంతో వడదెబ్బకు గురై, ఆస్పత్రి పాలయ్యారు.

నెల్లూరు జిల్లా కావలి వైసీపీ అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదివారం బోగోలు మండలంలో ప్రచారం నిర్వహిస్తూ ఎండ దెబ్బకు గురయ్యారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, పి. విష్ణుకుమార్ రాజు అస్వస్థతకు గురయ్యారు.

గత కొన్నాళ్లుగా ఎండలో ప్రచారాన్ని కొనసాగిస్తున్న అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మంగళవారం ప్రచార కార్యక్రమాలను సైతం రద్దు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండ రోజు రోజుకి పెరుగుతోంది.. దీంతో ఉదయం 10 గంటలకల్లా అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.

మధ్యాహ్నం ఒకటి, రెండు గంటలు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 4 గంటలకు మరలా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, నెల్లూరుల్లో 41 డిగ్రీలు.. ఒంగోలు, రాజమండ్రి, విజయవాడ, శ్రీకాకుళం, తాడేపల్లి గూడెం, గుంటూరుల్లో 38 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి 7 నుంచి 8 మధ్య రోడ్లన్నీ అభ్యర్థులు, కార్యకర్తలతో నిండిపోతున్నాయి.. నేతలు పాదయాత్రగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

గత మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో అభ్యర్థులు కూడా ప్రచార షెడ్యూల్‌ను మారుస్తున్నారు. ప్రతి రోజు నియోజకవర్గంలో 10 నుంచి 20 కిలోమీటర్లు మేర నేతలు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. 
 

click me!