మా ఇంట్లో వాళ్లు కూడా తిట్టారు, అయినా తప్పలేదు: పవన్ కళ్యాణ్

Published : Apr 04, 2019, 12:30 PM IST
మా ఇంట్లో వాళ్లు కూడా తిట్టారు, అయినా తప్పలేదు: పవన్ కళ్యాణ్

సారాంశం

టీడీపీకి మద్దతు ఇవ్వడంపై అంతా తిట్టేశారన్నారు. తన కుటుంబ సభ్యులు సైతం టీడీపీకి మద్దతు ఎందుకు ఇస్తున్నావ్ అంటూ తిట్టారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత టీడీపీతో విడిపోయినప్పుడు కూడా ఎలా వాడుకుని వదిలేశారో చూశావా అంటూ గుర్తు చేశారని చెప్పుకొచ్చారు. 

గాజువాక: తెలుగుదేశం పార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తనను వాడుకుని అవసరం తీరిపోయాక వదిలేస్తోందని తెలిసి కూడా మద్దతు పలికానని స్పష్టం చేశారు. 

విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇవ్వడంపై అంతా తిట్టేశారన్నారు. తన కుటుంబ సభ్యులు సైతం టీడీపీకి మద్దతు ఎందుకు ఇస్తున్నావ్ అంటూ తిట్టారని చెప్పుకొచ్చారు. 

ఆ తర్వాత టీడీపీతో విడిపోయినప్పుడు కూడా ఎలా వాడుకుని వదిలేశారో చూశావా అంటూ గుర్తు చేశారని చెప్పుకొచ్చారు. ఆనాడు తెలుగుదేశం పార్టీకి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మద్దతు పలికినట్లు పవన్ స్పష్టం చేశారు.

 రాష్ట్రవిభజన తర్వాత బలమైన నాయకత్వం అవసరమన్న కోణంలో తాను టీడీపీకి సపోర్ట్ చేసినట్లు తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కహామీకూడా నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.   

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు