పవన్‌కు చంద్రబాబు నాలుగో అన్న: జీవీఎల్ కీలక వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 01, 2019, 03:56 PM IST
పవన్‌కు చంద్రబాబు నాలుగో అన్న: జీవీఎల్ కీలక వ్యాఖ్యలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళకు పారిపోయారని, ఎన్నికలైన తర్వాత చంద్రబాబు ఎక్కడికి పారిపోతారో చూడాలని నరసింహారావు ఎద్దేవా చేశారు.

రాహుల్‌తో బాబు జత కట్టారని, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు తెలుగుదేశం పార్టీని సమాధి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రతిపక్ష ఓట్లు చీల్చేందుకు టీడీపీ కుట్ర పన్నిందని, జనసేన అధినేత పవన్‌కు చంద్రబాబు నాలుగో అన్న అని.. ఆయనతో జనసేనాని లాలూచీ పడ్డారని జీవీఎల్ ఆరోపించారు. కేంద్రంలో మళ్లీ మోడీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు