వైసీపీ అభ్యర్ధికి ఊరట: ప్రజా శాంతి అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

Published : Mar 26, 2019, 06:19 PM IST
వైసీపీ అభ్యర్ధికి ఊరట: ప్రజా శాంతి అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

సారాంశం

గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు  పోటీ చేస్తున్నారు


గుంటూరు: గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు  పోటీ చేస్తున్నారు. అయితే ఇదే స్థానంలో ప్రజా శాంతి పార్టీ అభ్యర్ధిగా నంబూరి శంకరరావును బరిలోకి దింపారు. అయితే ప్రజా శాంతి  పార్టీ అభ్యర్ధి నంబూరి శంకరరావు నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.

వైసీపీ అభ్యర్ధి నంబూరు శంకరరావు నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. ఎనిమిది నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధుల పేర్లను పోలి ఉన్న వారిని బరిలోకి దించారు.  ప్రజా శాంతి పార్టీ ఎన్నికల గుర్తు హెలికాప్టర్ కూడ వైసీపీని పోలి ఉంటుంది. 

చంద్రబాబు వ్యూహంలో భాగంగానే  ప్రజా శాంతి పుట్టుకొచ్చిందని  వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  ప్రజా శాంతి ఎన్నికల గుర్తు హెలికాప్టర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది.

సంబంధిత వార్తలు

కేఏ పాల్ గజిబిజి: ఇద్దరికి బీ ఫారాలు


 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు