ఆయనైతే వద్దు మరో నిపుణుడిని పంపించండి, డౌట్స్ క్లారిఫై చేస్తాం: చంద్రబాబుకు సిఈసీ లేఖ

By Nagaraju penumalaFirst Published Apr 13, 2019, 9:14 PM IST
Highlights

ఈవీఎంలపై నిపుణుల కమిటీతో చర్చించేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు రావాలని కోరారు. టీడీపీ తరపున హరిప్రసాద్ చర్చలో పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హరిప్రసాద్‌పై క్రిమినల్‌ కేసు ఉందని అందువ్ల వారితో చర్చలు జరపబోమని తెలిపారు. హరిప్రసాద్‌ కాకుండా ఇతర సాంకేతిక నిపుణులతో చర్చకు సిద్ధమని సునీల్ అరోరా లేఖలో స్పష్టం చేశారు.

ఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫిర్యాదుపై కేంద్రం ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పందించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పై చంద్రబాబు ఆరోపణలకు సంబంధించి వివరణ ఇస్తూ సునీల్ అరోరా లేఖ రాశారు. 

ఈవీఎంలపై నిపుణుల కమిటీతో చర్చించేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు రావాలని కోరారు. టీడీపీ తరపున హరిప్రసాద్ చర్చలో పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హరిప్రసాద్‌పై క్రిమినల్‌ కేసు ఉందని అందువ్ల వారితో చర్చలు జరపబోమని తెలిపారు. 

హరిప్రసాద్‌ కాకుండా ఇతర సాంకేతిక నిపుణులతో చర్చకు సిద్ధమని సునీల్ అరోరా లేఖలో స్పష్టం చేశారు. ఇకపోతే శనివారం మద్యాహ్నం చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాను కలిశారు. గంటన్నర పాటు సీఈసీతో చర్చించారు. ఐపీఎస్ అధికారుల బదిలీలు, సీఎస్ బదిలీ వంటి అంశాలపై చర్చించారు. 

అలాగే ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వంటి అంశాలపై చర్చించారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే కడప ఎస్పీని మార్చారని చంద్రబాబు ఆరోపించారు. 

ఎన్నికల్లో అభ్యర్థులు స్పీకర్‌పై దాడులు చేశారని, ఆంధ్రప్రదేశ్‌ని రావణకాష్టంగా మార్చాలనుకున్నారని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని, ఓటర్లు ఈసీకి భిక్షగాళ్లలా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే ప్రజలు కంకణం కట్టుకున్నారని, ఈవీఎంలపై ప్రతి ఒక్కరికి అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. 

click me!