పోలవరం పూర్తి చేసే వారికే ఓటేయండి: శివాజీ

Published : Apr 07, 2019, 09:57 AM ISTUpdated : Apr 07, 2019, 04:51 PM IST
పోలవరం పూర్తి చేసే వారికే ఓటేయండి: శివాజీ

సారాంశం

పోలవరం ప్రాజెక్టును ఎవరు పూర్తి చేస్తారో వారికే ఓటు వేయాలని సినీ నటుడు శివాజీ చెప్పారు.

పోలవరం ప్రాజెక్టును ఎవరు పూర్తి చేస్తారో వారికే ఓటు వేయాలని సినీ నటుడు శివాజీ చెప్పారు.

ఆదివారం నాడు శివాజీ మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు,  రాజధానిపై ట్రూత్‌ పేరుతో సినీ నటుడు శివాజీ మీడియా సమావేశంలో వీడియోన ప్రదర్శించారు.

పోలవరం ప్రాజెక్టు ఓ ఇంజనీరింగ్ అద్భుతమని శివాజీ అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా టీఆర్ఎస్‌ ఎంపీ కవిత గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో శివాజీ ప్రదర్శించారు.

పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలని కేసీఆర్, ఆ పార్టీకి చెందిన  నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం     అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నట్టుగా ఆయన వివరించారు.తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అడుగడుగునా అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.

ఈ ప్రాజెక్టును ఆపేందుకు నరేంద్రమోడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని శివాజీ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తన  దృష్టికి వచ్చిన విషయాలను ఆయన చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు ఎర్త్ డ్యామ్ పనులు సుమారు 80 శాతం పూర్తైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  జూన్ తర్వాత ఈ ప్రాజెక్టు ద్వారా గ్రావీటీ ద్వారా నీటిని విడుదల చేసే  అవకాశం ఉందని ఆయన వివరించారు.
 


 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు