నేను అన్నయ్య రెండేళ్లు మాట్లాడుకోలేదు, మా ఇద్దర్నీ కలిపింది ఆయనే: పవన్ కళ్యాణ్

By Nagaraju penumalaFirst Published Apr 6, 2019, 11:15 PM IST
Highlights

అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, తాను రెండేళ్లు మాట్లాడుకోలేదని పవన్ స్పష్టం చేశారు. తనను అన్నయ్య చిరంజీవిని కలిపింది నాదెండ్ల మనోహరేనంటూ చెప్పుకొచ్చారు. అందుకే తనకు నాదెండ్ల మనోహర్ అంటే అంత గౌరవమన్నారు. తాను గౌరవించే కొద్దిమంది వ్యక్తులలో ఆయన ఒకరంటూ చెప్పుకొచ్చారు. నాదెండ్ల మనోహర్ ని గెలిపించాలని కోరారు. 
 

గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, తాను రెండేళ్లు మాట్లాడుకోలేదని పవన్ స్పష్టం చేశారు. 

తనను అన్నయ్య చిరంజీవిని కలిపింది నాదెండ్ల మనోహరేనంటూ చెప్పుకొచ్చారు. అందుకే తనకు నాదెండ్ల మనోహర్ అంటే అంత గౌరవమన్నారు. తాను గౌరవించే కొద్దిమంది వ్యక్తులలో ఆయన ఒకరంటూ చెప్పుకొచ్చారు. నాదెండ్ల మనోహర్ ని గెలిపించాలని కోరారు. 

నాదెండ్ల గెలుపుకోసం జనసేన పార్టీ కార్యకర్తలు కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. టీడీపీ నేతల్లాగా తాము భూ కబ్జా చేసేవాళ్లం కాదన్నారు. ప్రజా సేవ చేసేందుకే తాను రాజీకాయల్లోకి వచ్చానన్నారు. రెండేళ్లు జైల్లో ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తాడా అంటూ వైఎస్ జగన్ పై కామెంట్స్ చేశారు. 

జగన్ చుట్టు ఉన్నవారిలో నేరస్థులెక్కువ అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఒక సూచన చేశారు. ఏపీ రాజకీయాల్లోకి రావొద్దని కేసీఆర్ ను మరోసారి కోరుతున్నానని తెలిపారు. 

జనసేన పార్టీ కులాల ఐక్యత కోసం పాటుపడే పార్టీ అని చెప్పుకొచ్చారు. కులాల మధ్య చిచ్చుపెడితే సహించేది లేదన్నారు. రాజకీయ నేతకు కులం, మతం అనే తేడా ఉండకూడదన్నారు. ప్రజారాజ్యం పార్టీతో  వ్యవస్థలో మార్పు వస్తుందని తాను భావించానని చెప్పుకొచ్చారు. 

నాయకుడు మంచివాడైతే సరిపోదని పక్కన ఉండేవాళ్లు కూడా మంచి నేతలై ఉండాలని అభిప్రాయపడ్డారు. తాను ఎంత మెత్తగా ఉంటానో ప్రజల జోలికి వస్తే అంతే కఠినంగా ఉంటానని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 

ఇకపోతే శుక్రవారం అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్ అదే రోజు రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం శనివారం సాయంత్రం తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

click me!