నాపై జనసేన తప్పుడు ప్రచారం చేస్తోంది: ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైసీపీ అభ్యర్థి

By Nagaraju penumalaFirst Published Apr 6, 2019, 11:51 PM IST
Highlights

నాలుగు నెలల క్రిందట కూరాడ గ్రామంలో కాలుజారి పడిపోయిన దళిత వృద్ధురాలికి ధన సహాయం చేశానని, ఆ సమయంలో తీసిన ఫోటోను మార్ఫింగ్‌ చేసి ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నట్లుగా, పోలీసులు అరెస్ట్‌ చేసినట్లుగా జనసేన దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో నాగమల్లితోట జంక్షన్‌ వద్ద సర్పవరం పోలీసులు అరెస్ట్‌ చేసిన ఫోటోను ఇటీవలే అరెస్ట్‌ చేసినట్లు జనసేన తప్పుడు ప్రచారం చేస్తోందని కన్నబాబు ఆరోపించారు. 
 

కాకినాడ: కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల మధ్య రచ్చ మళ్లీ మెుదలైంది. ఇటీవలే ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఒకానొక సందర్భంలో దాడి చేసుకునేందుకు కూడా రెడీ అయ్యాయి. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ, జనసేనల మద్య యుద్ధవాతావరణం నెలకొంది. కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. 

కురసాల కన్నబాబు ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లుగా, పోలీసులు అరెస్ట్ చేసి ఆ డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జనసేన పార్టీ నేతలే కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

నాలుగు నెలల క్రిందట కూరాడ గ్రామంలో కాలుజారి పడిపోయిన దళిత వృద్ధురాలికి ధన సహాయం చేశానని, ఆ సమయంలో తీసిన ఫోటోను మార్ఫింగ్‌ చేసి ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నట్లుగా, పోలీసులు అరెస్ట్‌ చేసినట్లుగా జనసేన దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. 

ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో నాగమల్లితోట జంక్షన్‌ వద్ద సర్పవరం పోలీసులు అరెస్ట్‌ చేసిన ఫోటోను ఇటీవలే అరెస్ట్‌ చేసినట్లు జనసేన తప్పుడు ప్రచారం చేస్తోందని కన్నబాబు ఆరోపించారు. 

సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. 

click me!