నిన్నంతా హైద్రాబాద్‌లోనే జగన్, మరో కుట్ర: చంద్రబాబు

Published : Apr 03, 2019, 11:58 AM IST
నిన్నంతా హైద్రాబాద్‌లోనే జగన్, మరో కుట్ర: చంద్రబాబు

సారాంశం

నిన్నంతా హైద్రాబాద్‌లోనే వైఎస్ జగన్ మరో కుట్రకు తెరతీసేందుకు ప్రయత్నిస్తున్నారని  ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు  


అమరావతి: నిన్నంతా హైద్రాబాద్‌లోనే వైఎస్ జగన్ మరో కుట్రకు తెరతీసేందుకు ప్రయత్నిస్తున్నారని  ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు

బుధవారం నాడు ఆయన పార్టీ నేతలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. నేరస్తుల పార్టీని నమ్మటానికి వీల్లేదన్నారు.పింఛన్ డబ్బులు ఇప్పటికే లబ్దిదారులకు అందాయని ఆయన తెలిపారు.నాలుగైదు రోజుల్లో పసుపు- కుంకుమ, అన్నదా సుఖీభవ, రుణమాఫీకి కింద  లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని బాబు చెప్పారు

అన్నదాత సుఖీభవ కింద  ఇప్పటికే వెయ్యి రూపాయాలను జమ అయ్యాయని బాబు గుర్తు చేశారు. మరో రూ. 3 వేలు కూడ జమ  అవుతాయని ఆయన తెలిపారు.చెక్కులు చెల్లవని ప్రచారం చేసినవారికి ఇది చెంపపెట్టులాంటిదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

లబ్దిదారుల సంక్షేమానికి అడ్డుపడేందుకు వైసీపీ కుట్రపన్నుతోందని చంద్రబాబు ఆరోపించారు.పార్టీ కోసం పనిచేసేవారికి తాను అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు