చిరంజీవి కుటుంబాన్ని నమ్ముతారా? .. చిన్ని కృష్ణ కామెంట్స్

Published : Apr 03, 2019, 11:41 AM IST
చిరంజీవి కుటుంబాన్ని నమ్ముతారా? .. చిన్ని కృష్ణ కామెంట్స్

సారాంశం

నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణం రాజుకు జనసేన అభ్యర్థి నాగబాబు అసలు పోటీయే కాదని ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ అన్నారు. 

నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణం రాజుకు జనసేన అభ్యర్థి నాగబాబు అసలు పోటీయే కాదని ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ అన్నారు. చిన్ని కృష్ణ ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

కాగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 120 సీట్లకు పైగా గెలిచి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అభిమాన హీరోల సినిమాలు 10 సార్లు చూడండి కానీ ఓటు మాత్రం  వైఎస్సార్‌ సీపీకే వేయమని ప్రజలను కోరారు. 

గతంలో చిరంజీవికి లక్షల మంది ఓట్లు వేస్తే ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. అదే కుటుంబం నుంచి మళ్లీ ఇద్దరు వచ్చి ఓట్లు అడిగితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. భీమవరంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓటమి ఖాయమన్నారు. అక్కడ వైఎస్సార్‌సీసీ అభ్యర్థి శ్రీనివాస్‌ ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు