దేశంలో జీఎస్టీ... సత్తెనపల్లిలో కేఎస్టీ: కోడెలపై జగన్ ఫైర్

By Siva KodatiFirst Published Apr 3, 2019, 11:48 AM IST
Highlights

సత్తెనపల్లి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన రోడ్‌షోలో ప్రసంగించారు. 

సత్తెనపల్లి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన రోడ్‌షోలో ప్రసంగించారు.

దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లో ఉంటే సత్తెనపల్లి, నరసరావుపేటలలో మాత్రం కేఎస్టీ అని కోడెల సర్వీస్ ట్యాక్స్ ఉందని జగన్ ఆరోపించారు. ఐదేళ్ల నుంచి సత్తెనపల్లిలో మామూళ్లు ఇవ్వనిదే ఏ పని జరగడం లేదన్నారు.

కోడెలకు చెందిన సేఫ్ ఫార్మా కంపెనీ అన్ని నాసిరకం ఉత్పత్తులను తయారు చేస్తుందని జగన్ ఆరోపించారు. స్పీకర్ స్థానాన్ని భ్రష్టు పట్టించిన ఏకైక నాయకుడు కోడెల శివప్రసాదేనని ఎద్దేవా చేశారు.

రోజుకు నాలుగు దుష్ప్రచారాలు చేసినా కూడా జనం నమ్మటం లేదన్న భయం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, సీఎం చంద్రబాబుల ముఖంలో కనిపిస్తోందని జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు అధికారం వచ్చేస్తోందని లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సర్వే పేరుతో రాధాకృష్ణ తన పేపర్‌లో మొదటి పేజీలో వేయించారని వైసీపీ చీఫ్ ఎద్దేవా చేశారు.

అయితే అలాంటి సర్వే తాము చేయలేదని లోక్‌నీతి సంస్థ చీ కొట్టిందన్నారు. బంగారం కంటే బొగ్గే అందంగా ఉందని, నెమలి కంటే కాకే అందంగా ఉందన్నట్లుగా యెల్లో మీడియా తీరు ఉందని జగన్ ఎద్దేవా చేశారు.

ప్రపంచంలోనే అందరికంటే అందగాడు, పరిపాలనాదక్షుడు ఎవరంటే చంద్రబాబే వారికి గుర్తొస్తాయన్నారు. జర్నలిజమంటే చంద్రబాబు ప్రయోజనమా..? లేదంటే బాబు ద్వారా మీ ప్రయోజనమా..? లేక ప్రజల ప్రయోజనమా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. 
 

click me!