ఈసీ తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి: నిరసనకు రెడీ

By narsimha lodeFirst Published Apr 10, 2019, 11:42 AM IST
Highlights

ఈసీ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఈసీ తీరుపై బాబు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. 


అమరావతి: ఈసీ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఈసీ తీరుపై బాబు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి నిరసన తెలిపే అవకాశం ఉంది.

ఏపీ రాష్ట్రంలో టీడీపీ అభ్యర్థులపై ఐటీ దాడులతో పాటు, అధికారుల ఏకపక్ష బదిలీలను నిరసిస్తూ చంద్రబాబునాయుడు గోపాలకృష్ణ ద్వివేది వద్ద నిరసనను వ్యక్తం చేసే అవకాశం ఉంది.

మంగళవారం రాత్రి ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌ను బదిలీ చేశారు. ఈ విషయమై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈసీకి లేఖ రాశారు. బుధవారం నాడు సచివాలయంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి తన వాదనను వినిపించనున్నారు. అవసరమైతే  ద్వివేది కార్యాలయం ఎదుటే బాబు నిరసనకు దిగే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తమ పార్టీ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులపై  కనీసం చర్యలు కూడ తీసుకోలేదని టీడీపీ అభిప్రాయపడుతోంది.  వైసీపీ ఫిర్యాదులపై ఈసీ వెంటనే చర్యలు తీసుకొంటుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత టీడీపీ అభ్యర్థులను లక్ష్యంగా ఐటీ అధికారుల దాడులు కొనసాగిన విషయాన్ని టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

చంద్రబాబు ఆగ్రహం: ఈసీకి నిరసన లేఖ

click me!