మాయావతికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం

Published : Apr 02, 2019, 05:25 PM ISTUpdated : Apr 02, 2019, 05:37 PM IST
మాయావతికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం

సారాంశం

బీఎస్పీ అధినేత్రి మాయావతికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాదాబివందనం చేశారు. ఏపీ రాష్టంలో ఎన్నికల ప్రచారం కోసం మాయావతి మంగళవారం నాడు విశాఖకు చేరుకొన్నారు.  

విశాఖపట్టణం: బీఎస్పీ అధినేత్రి మాయావతికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాదాబివందనం చేశారు. ఏపీ రాష్టంలో ఎన్నికల ప్రచారం కోసం మాయావతి మంగళవారం నాడు విశాఖకు చేరుకొన్నారు.

బీఎస్పీ అధినేత్రి రెండు రోజుల పాటు ఏపీ రాష్ట్రంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఏపీ రాష్ట్రంలో జనసేనతో కలిసి బీఎస్పీ పోటీ చేస్తోంది.విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొన్న మాయావతికి పవన్ కళ్యాణ్ పాదాబివందనం చేశారు. ఈ ఇధ్దరు నేతలు కలిసి ఏపీలో పలు సభల్లో ప్రచారం నిర్వహించనున్నారు. 

మాయావతి ప్రధాని కావాలని పవన్ కళ్యాణ్  అభిప్రాయపడిన విషయం తెలిసిందే. బీఎస్పీ చీఫ్ మాయావతి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ఏప్రిల్ మూడో తేదీన విశాఖలో మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇవాళ మరికొద్దిసేపట్లో విశాఖ కేంద్రంగా నిర్వహించే బహిరంగసభలో మాయావతి పాల్గొంటారు.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు