మాజీమంత్రి పీతల సుజాతపై అంబికా కృష్ణ వ్యాఖ్యలు: దళిత సంఘాలు ఆగ్రహం

By Nagaraju penumalaFirst Published Apr 2, 2019, 4:59 PM IST
Highlights

 పీతల సుజాతకు పొగరు, అహంకారం ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఆమెను ఎమ్మెల్యేగా చేసి కేబినేట్ లో మంత్రి పదవి ఇస్తే ఇప్పుడు తిరుగుబాటు చేస్తారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అంబికా కృష్ణ వ్యాఖ్యలపై ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యకుడు వెంకటేశ్వరరావు స్పందించారు. ఒక మంత్రిగా పనిచేసి, రాజకీయంగా గుర్తింపు పొందిన దళిత మహిళపై అంబికా కృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం తగదని హితవు పలికారు. 

విజయవాడ: మాజీమంత్రి పీతల సుజాతపై ఏపీ ఫిల్మ్ డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నేత అంబికా కృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరులో పర్యటించిన అంబికా కృష్ణ మాజీమంత్రి పీతల సుజాతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఆమెకు పొగరు, అహంకారం ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఆమెను ఎమ్మెల్యేగా చేసి కేబినేట్ లో మంత్రి పదవి ఇస్తే ఇప్పుడు తిరుగుబాటు చేస్తారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అంబికా కృష్ణ వ్యాఖ్యలపై ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యకుడు వెంకటేశ్వరరావు స్పందించారు. 

ఒక మంత్రిగా పనిచేసి, రాజకీయంగా గుర్తింపు పొందిన దళిత మహిళపై అంబికా కృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం తగదని హెచ్చరించారు. పీతల సుజాతపై చేసిన వ్యాఖ్యలకు అంబికా కృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీలో దళిత నాయకులపై గౌరవంగా ప్రవర్తించరని, చులకనభావంతో చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మాజీమంత్రి పీతల సుజాతపై అంబికా కృష్ణ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. గతంలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలువురు టీడీపీ దళిత నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వెంకటేశ్వరరావు ఆరోపించారు.  

click me!