ఇంకెందుకు ఆ ముసుగూ తొలగించండి: కళా వెంకట్రావ్

By Nagaraju penumalaFirst Published Mar 27, 2019, 7:45 PM IST
Highlights

కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటని జగన్ ఒక ముసుగును తొలగించారని అభిప్రాయపడ్డారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న రహస్య బంధాన్ని సైతం బయటపెట్టి ఆ ముసుగును కూడా తొలగించాలని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా పనిచేస్తున్న పోలీసు అధికారులపై బదిలీ వేటు వేయాలని లేఖ రాయడం సిగ్గుచేటని లేఖలో విమర్శించారు. 

అమరావతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లేఖాస్త్రం సంధించారు ఏపీ మంత్రి కళా వెంకట్రావ్. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిస్తే తప్పేంటని జగన్ వ్యాఖ్యానించడంపై కామెంట్స్ చేశారు. 

కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటని జగన్ ఒక ముసుగును తొలగించారని అభిప్రాయపడ్డారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న రహస్య బంధాన్ని సైతం బయటపెట్టి ఆ ముసుగును కూడా తొలగించాలని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. 

నిష్పక్షపాతంగా పనిచేస్తున్న పోలీసు అధికారులపై బదిలీ వేటు వేయాలని లేఖ రాయడం సిగ్గుచేటని లేఖలో విమర్శించారు. ముగ్గురు ఐపీఎస్‌లను ఆఘమేఘాల మీద బదిలీ చేశారంటే మోదీతో జగన్‌కు ఉన్న బంధం ఎంత గట్టిదో అర్థమౌతోందని ఆరోపించారు. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ అవసరంలేదని జగన్ బాబాయ్ ప్రతాప్ రెడ్డి అన్నారని కళా వెంకట్రావ్ ప్రశ్నించారు. 

click me!