జనసేన అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణపై చంద్రబాబు సెటైర్లు

Published : Apr 05, 2019, 09:40 PM IST
జనసేన అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణపై చంద్రబాబు సెటైర్లు

సారాంశం

తాను పడితే ఉడుం పట్టేనని పడితే విడవనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నీతివంతమైన సుపరిపాలన టీడీపీతోనే సాధ్యమని తెలిపారు. కేసీఆర్ కు జగన్ ఊడిగం చేస్తున్నారని తెలిపారు. శ్రీశైలం, సాగర్, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు జోలికి వస్తే వదిలిపెట్టేది లేదని కేసీఆర్ ను హెచ్చరించారు. 

విశాఖపట్నం: సీబీఐ మాజీ జేడీ, విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి విశాఖపట్నం జిల్లా కంచర్లపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణలా కేసులను మధ్యలో వదిలిపెట్టనని చెప్పుకొచ్చారు. 

తాను పడితే ఉడుం పట్టేనని పడితే విడవనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నీతివంతమైన సుపరిపాలన టీడీపీతోనే సాధ్యమని తెలిపారు. కేసీఆర్ కు జగన్ ఊడిగం చేస్తున్నారని తెలిపారు. శ్రీశైలం, సాగర్, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు జోలికి వస్తే వదిలిపెట్టేది లేదని కేసీఆర్ ను హెచ్చరించారు. 

విశాఖపట్నంకు నీటి ఎద్దడి తీర్చుతానని హామీ ఇచ్చారు. విశాఖపట్నంను కాస్మోపాలిటిన్ సిటీగా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. సింహాచలం భూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. పేదలందరికీ అర్బన్ ఏరియాలు ఇళ్లుకట్టిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు విదేశీ విద్యకోసం రూ.25 లక్షల ఇస్తామని హామీ ఇచ్చారు.   

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు