నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో, జైలుకైనా వెళ్తా కానీ...: సీఎస్ బదిలీపై చంద్రబాబు వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Apr 5, 2019, 9:09 PM IST
Highlights

తనను ఏకాకిని చేసి ఇబ్బందులు గురి చేస్తారా అంటూ నిలదీశారు. టీడీపీ అభ్యర్థుల ఇంటిపై ఐటీ సోదాలు నిర్వహించి తమ అభ్యర్థులను నిర్వీర్యం చేసేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఐటీ దాడులు, ఈడీ దాడులు చేస్తారా అంటూ మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేపు తనను కూడా అరెస్ట్ చేస్తారేమో అని చెప్పుకొచ్చారు. అవసరమైతే జైలుకైనా వెళ్తా కానీ ఎవరికీ భయపడమన్నారు. 

విశాఖపట్నం: ఏపీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠా బదిలీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా కంచర్లపాలెం ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబు సీఎస్ బదిలీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఏ తప్పు చెయ్యని సీఎస్ అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చెయ్యడం బాధాకరమన్నారు. ఆయన ఏ తప్పు చేశారో చెప్పకుండా బదిలీ చెయ్యడం దుర్మార్గమన్నారు. తాను ధర్మం కోసం పోరాటం చేస్తుంటే తనను ఒక్కడిని చేసి వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ ను బదిలీ చేశారు, ఇప్పుడు సీఎస్ ను బదిలీ చేశారని తెలిపారు. తనను ఏకాకిని చేసి ఇబ్బందులు గురి చేస్తారా అంటూ నిలదీశారు. టీడీపీ అభ్యర్థుల ఇంటిపై ఐటీ సోదాలు నిర్వహించి తమ అభ్యర్థులను నిర్వీర్యం చేసేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

ఐటీ దాడులు, ఈడీ దాడులు చేస్తారా అంటూ మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేపు తనను కూడా అరెస్ట్ చేస్తారేమో అని చెప్పుకొచ్చారు. అవసరమైతే జైలుకైనా వెళ్తా కానీ ఎవరికీ భయపడమన్నారు. 

గురువారం ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చి డోర్లు మూసివేశామని చెప్పారని గుర్తు చేశారు. ఎవరికి కావాలి నీ డోర్లు అంటూ విరుచుకుపడ్డారు. మోదీ, అమిత్ షా ఎంత బయపెట్టినా తాను భయపడేది లేదని చంద్రబాబు నాయుడు తెలిపారు. 

click me!