ఏపిలో ఎలక్షన్స్ హీట్: ఆర్టీసి బస్సులో రూ.10 కోట్లు తరలింపు... వారి పనేనా?

By Arun Kumar PFirst Published Apr 5, 2019, 8:56 PM IST
Highlights

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు దేశ వ్యాప్తంగా భారీ మొత్తంలో నగదు, మద్యం ప్రవాహం సాగుతోంది. కేవలం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోనే పరిస్థితి ఇలా వుంటే  లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ఈ ప్రవాహం మరీ ఎక్కువగా వుంది.  ఈ  విషయం ఈసీ, పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్న కోట్ల కొద్ది డబ్బును చూస్తేనే తెలిసిపోతోంది.

ఇలా శుక్రవారం కూడా ఏపిలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ పరధిలో తనిఖీలు చేపడుతున్న పోలీసులు ఓ ఆర్టీసి బస్సులో రూ.10 కోట్లను గుర్తించారు. మూడు బ్యాగుల నిండా నోట్ల కట్టలను బస్సు డిక్కీలో పెట్టి తరలిస్తూ కొందరు పట్టుబడ్డారు. ఈ డబ్బులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వీటిని తరలిస్తున్న పాలవలస విక్రాంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇలా భారీ డబ్బులతో పట్టుబడ్డ విక్రాంత్ వైఎస్సార్‌సిపి కి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. అతడి వద్ద ఈ డబ్బుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఇంత భారీ మొత్తంలో డబ్బును ఎందుకోసం తరలిస్తున్నాడో మాత్రం ఇంకా తెలియరాలేదని... పట్టుబడ్డ వ్యక్తిని విచారించి ఈ నగదు తరలింపులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 
 
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చేపడుతున్న తనిఖీల్లో కోట్ల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు, సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న సొమ్మును సీజ్ చేస్తున్నారు. ఎన్నికలు కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 377 కోట్లు పట్టుబడగా ఒక్క ఏపినుండే రూ. 97 కోట్లు వున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు రూ. 32 కోట్లు సీజ్ చేశారు.  
 
click me!