దిగొచ్చిన అంబికా కృష్ణ: పీతల సుజాతకు క్షమాపణ

Published : Apr 03, 2019, 01:12 PM IST
దిగొచ్చిన అంబికా కృష్ణ: పీతల సుజాతకు క్షమాపణ

సారాంశం

మాజీ మంత్రి పీతల సుజాతకు టీడీపీ నేత, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్ అంబికా కృష్ణ క్షమాపణలు చెప్పారు.తన వ్యాఖ్యలు బాధ కల్గిస్తే క్షమాపణ చెబుతున్నట్టుగా టీడీపీ నేత అంబికా కృష్ణ ప్రకటించారు. 

ఏలూరు: మాజీ మంత్రి పీతల సుజాతకు టీడీపీ నేత, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్ అంబికా కృష్ణ క్షమాపణలు చెప్పారు.తన వ్యాఖ్యలు బాధ కల్గిస్తే క్షమాపణ చెబుతున్నట్టుగా టీడీపీ నేత అంబికా కృష్ణ ప్రకటించారు. 

తనపై అంబికా కృష్ణ చేసిన వ్యాఖ్యలపై పీతల సుజాత స్పందించారు.  దీంతో బుధవారం నాడు ఓ తెలుగు న్యూస్ చానెల్‌తో అంబికా కృష్ణ మాట్లాడారు. పీతల సుజాతకు క్షమాపణలు చెప్పారు.

పీతల సుజాత తనకు సోదరిలాంటిదని ఆయన చెప్పారు. సుజాతను ఎవరో తప్పుదోవపట్టిస్తున్నారని అంబికా కృష్ణ అభిప్రాయపడ్డారు. తనపై పీతల సుజాత ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసిందో తనకు అర్ధం కావడం లేదన్నారు. పీతల సుజాతను త్వరలోనే కలుస్తానని ఆయన ప్రకటించారు.సుజాతతో తనకు ఎలాంటి విభేధాలు లేవని ఆయన ప్రకటించారు. తమ మధ్య నెలకొన్న గ్యాప్‌ను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అంబికా కృష్ణ తిట్ల వర్షం: ఏడ్చేసిన పీతల సుజాత

మాజీమంత్రి పీతల సుజాతపై అంబికా కృష్ణ వ్యాఖ్యలు: దళిత సంఘాలు ఆగ్రహం

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు