'మంగళగిరిలో జగన్ పెయిడ్ ఆర్ఠిస్టులు, లోకేష్‌దే గెలుపు'

Published : Apr 03, 2019, 12:58 PM IST
'మంగళగిరిలో జగన్ పెయిడ్ ఆర్ఠిస్టులు, లోకేష్‌దే గెలుపు'

సారాంశం

ఎందరిని పంపినా కూడ మంగళగిరిలో లోకేష్ గెలుపును ఆపడం ఎవరి తరం కాదని  టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. వైసీపీ నేతలు  చేస్తున్న అన్ని ప్రయత్నాలను మంగళగిరి ఓటర్లు తిప్పికొట్టనున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.


మంగళగిరి:  ఎందరిని పంపినా కూడ మంగళగిరిలో లోకేష్ గెలుపును ఆపడం ఎవరి తరం కాదని  టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. వైసీపీ నేతలు  చేస్తున్న అన్ని ప్రయత్నాలను మంగళగిరి ఓటర్లు తిప్పికొట్టనున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ పంపించిన పెయిడ్ ఆర్టిస్టుల ఆటలు మంగళగిరిలో సాగవని  ఆయన అభిప్రాయపడ్డారు. 40 ఏళ్ల పాటు లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తారని ఆయన చెప్పారు.జగన్ తన సైన్యాన్ని పంపించినా  కూడ మంగళగిరిలో లోకేష్ గెలుపును ఆపడం ఎవరితరం కాదన్నారు. మే 23వ తేదీన వచ్చే ఫలితాలను చూసి జగన్ ఆశ్చర్యపడుతారన్నారు..

టీడీపీకి బీసీలు అండగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ కారణంగానే కుప్పంలో చంద్రబాబు విజయం సాధిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మంగళగిరిలో కూడ బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని ఆయన చెప్పారు. బీసీలు టీడీపీకి వెన్నెముకగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ కారణంగానే  మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తున్నారని బుద్దా వెంకన్న చెప్పారు.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు