చంద్రబాబు నయవంచకుడు, ఓట్ల దొంగ: వైఎస్ జగన్ నిప్పులు

Published : Mar 11, 2019, 04:58 PM IST
చంద్రబాబు నయవంచకుడు, ఓట్ల దొంగ: వైఎస్ జగన్ నిప్పులు

సారాంశం

ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతికి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి తెలంగాణతో రాజీపడి అమరావతికి వచ్చేశానంటూ సిగ్గులేకుండా చెప్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

కాకినాడ: చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు లాంటి నయవంచకుడు రాజకీయాల్లో ఎవరూ ఉండరన్నారు. తన స్వార్థం కోసం ప్రజలను రాష్ట్రాన్ని తాకట్టుపెట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తారు. 

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖారావం బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడు తీరుపై నిప్పులు చెరిగారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. 

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతికి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి తెలంగాణతో రాజీపడి అమరావతికి వచ్చేశానంటూ సిగ్గులేకుండా చెప్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

తెలంగాణ కోసమే తాను కొన్ని సంస్థలను వదులు కోవాల్సి వచ్చిందంటూ మాట్లాడటం బాధాకరమన్నారు. పసుపు కుంకుమ పథకం ఓట్లు కోసమేనంటూ సిగ్గు లేకుండా ప్రకటిస్తారా అంటూ మండిపడ్డారు వైఎస్ జగన్.

ఈ వార్తలు కూడా చదవండి

ఒక్క అవకాశం ఇవ్వండి, రాజన్న రాజ్యం తీసుకొస్తా: వైఎస్ జగన్

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్