దిక్కుమాలిన ఎమ్మెల్యే: యరపతినేనిపై జగన్ ఫైర్

By Siva KodatiFirst Published Apr 3, 2019, 1:16 PM IST
Highlights

లక్షమందిపైగా ప్రజలు నివసిస్తున్న పిడుగురాళ్లలో 100 పడకల ఆసుపత్రి లేని పరిస్ధితుల్లో పిడుగురాళ్ల ఉందన్నారు వైఎస్ జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం పిడుగురాళ్లలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు.

గురజాలలో యరపతినేని అనే ఒక దిక్కుమాలిన ఎమ్మెల్యే ఉన్నారని, ఆయన మైనింగ్ వ్యాపారాల పేరుతో గనులను దోపిడి చేస్తున్నారని జగన్ ఆరోపించారు. అక్రమ మైనింగ్‌లో వచ్చిన డబ్బును ముఖ్యమంత్రి, ఆయన కుమారుడితో కలిసి యరపతినేని భాగాలు పంచుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

మైనింగ్‌ అవకతవకల్లోని రూ.100 కోట్లను రీకవరి చేయాల్సిందిగా కోర్టు ఆదేశిస్తూ.. సాధారణ మైనింగ్ వ్యాపారులను పోలీసులు వేధిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. మనం ఎప్పుడో నవరత్నాలను ప్రవేశపెడితే.. ఎన్నికలకు మూడు నెలల ముందు మన పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారని వైసీపీ చీఫ్ ఆరోపించారు. 1

click me!