ఏపీలో సినీ నటి రేవతి ప్రచారం

Published : Apr 03, 2019, 02:07 PM IST
ఏపీలో సినీ నటి రేవతి ప్రచారం

సారాంశం

ఏపీ ఎన్నికల్లో సినీ తారల సందడి కూడా మొదలైంది. ఇప్పటికే టీడీపీ తరపున హీరో నారా రోహిత్ ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు ప్రకటించేశారు. 

ఏపీ ఎన్నికల్లో సినీ తారల సందడి కూడా మొదలైంది. ఇప్పటికే టీడీపీ తరపున హీరో నారా రోహిత్ ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు ప్రకటించేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ.. ఇతర నటీనటులు ప్రచారం చేస్తున్నారు. ఇక జగన్ తరపున ప్రచారం చేయడానికి మోహన్ బాబు, జయసుధ, అలీ లాంటి నటీనటులు  చాలా మందే ఉన్నారు.

కాగా.. తాజాగా మరో సినీ నటి పేరు ప్రధానంగా వినపడుతోంది. అలనాటి తార రేవతి ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. టీడీపీ స్టార్ క్యాంపైనర్ల జాబితాలో రేవతి పేరు ఉండటం విశేషం.

ఈ నెల 4వ తేదీ ఉదయం 9 గంటలకు ఏలూరు నియోజకవర్గంలోని 49వ డివిజన్‌లో, సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం పాలకొల్లులో బస చేస్తారు. 5వ తేదీ ఉదయం 9 గంటలకు పాలకొల్లు, సాయంత్రం 4 గంటలకు నరసాపురం నియోజకవర్గాల్లో రేవతి ప్రచారం నిర్వహిస్తారు. ఈ విషయాన్ని రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పాలి ప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పాల్గొని విజయంతం చేయాలని పాలి ప్రసాద్‌ కోరారు.
 

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్