జగన్ సభలో మళ్లీ అపశృతి.. ఒకరి మృతి

Published : Apr 05, 2019, 03:20 PM IST
జగన్ సభలో మళ్లీ అపశృతి.. ఒకరి మృతి

సారాంశం

వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారంలో మరోసారి అపశ్రుతి చోటుచేసుకుంది. జగన్ రోషోకి వేల సంఖ్యలో జనాలు తరలివచ్చారు. కాగా ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 

వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారంలో మరోసారి అపశ్రుతి చోటుచేసుకుంది. జగన్ రోషోకి వేల సంఖ్యలో జనాలు తరలివచ్చారు. కాగా ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది.

రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జగన్ ఎన్నికల ప్రచారంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అప్పుడు కరెంట్ షాక్ తగిలి ఒకరు మృతి చెందగా పది మంది గాయాలపాలయ్యారు. తాజాగా ఇప్పుడు తొక్కిసలాట జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుప్పంలో జగన్‌ ఇవాళ పర్యటించారు. జగన్‌ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే స్వల్ప తొక్కిసలాట జరిగింది. 

శాంతిపురం మండలం 121 పెద్దూరు గ్రామ తాజా మాజీ సర్పంచి బేట్రాయుడు (40) స్పృహ కోల్పోయారు. దీంతో అతడిని వెంటనే వైకాపా కార్యకర్తలు కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే బేట్రాయుడు మరణించారు. ఇరుకు రహదారిలో సభ నిర్వహించడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్