కుటుంబ పాలనను పారద్రోలాలి... పవన్ కళ్యాణ్

By ramya NFirst Published Apr 5, 2019, 2:26 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. శుక్రవారం ఆయన విజయనగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయనగరంలో కుటుంబ పాలన సాగుతోందని దానిని పారద్రోలాలని పవన్ పిలుపునిచ్చారు.
 
విజయనగరంలో బొత్స కుటుంబ పాలనకు తెరతిందాలన్నారు. అందుకే ఎంపీ అభ్యర్థిగా ఉన్న బొత్స సత్యనారాయణను ఎదుర్కోవడానికి బుక్కా శ్రీనివసరావును జనసేన తరపున నిలబెట్టినట్లు వివరించారు. ఈ ప్రాంతంలో బొత్స, ఆయన భార్య, తమ్ముడు, మేనల్లుడి చేతిలోనే పాలన ఉండాలా అని ప్రశ్నించారు.

 జనసేన పార్టీకి మూడు ప్రాధమ్యాలూ జనమేనని, చంద్రబాబుకు మొదటి రెండు ప్రాధాన్యాలు వ్యక్తిత్వమని, మూడో ప్రాధాన్యం తన కుమారుడని విమర్శించారు. జగన్‌కు మాత్రం మూడు ప్రాధాన్యాలూ వ్యక్తిత్వమే ఉంటుందని ఎద్దేవా చేశారు. వలసలు ఆగిపోయి విజయనగరాన్ని అద్భుత నగరంగా మార్చుతానని హామీ ఇచ్చారు.

ఉద్యోగాలు రావాంటే ఇక్కడ ఉన్న మూడు జూట్‌ మిల్లులను తెరిపించాలని, వాటిని తిరిగి తెరిపించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. సంస్థానం గౌరవం నిలబెట్టే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు చెప్పారు. జగన్‌-బొత్స కలయిక చాలా అద్భుతంగా ఉందని ఎద్దేవా చేశారు.

click me!