బాబు సర్కార్‌కు పోలవరం ఏటీఎం లాంటిది: మోడీ

By narsimha lodeFirst Published Apr 1, 2019, 3:35 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్టు ఏపీ సర్కార్‌కు ఓ ఏటీఎంలాంటిదని  ప్రధానమంత్రి మోడీ విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్టు నుండి డబ్బులను డ్రా చేస్తూ తమ ఖజానాలో వేసుకొంటున్నాడని ఆయన ఆరోపించారు.

రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టు బాబు సర్కార్‌కు ఓ ఏటీఎంలాంటిదని  ప్రధానమంత్రి మోడీ విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్టు నుండి డబ్బులను డ్రా చేస్తూ తమ ఖజానాలో వేసుకొంటున్నాడని ఆయన ఆరోపించారు.

సోమవారం నాడు రాజమండ్రిలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి మోడీ పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నాలుగు దశాబ్దాలుగా ప్రారంభానికి నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురైందన్నారు. . ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఉద్దేశ్యం ప్రస్తుత ముఖ్యమంత్రి బాబుతో పాటు గత పాలకులకు కూడ లేదని ఆయన విమర్శించారు.

తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలోనే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తూ నిర్ణయం తీసుకొందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లను కేంద్రం మంజూరు చేసిందని ఆయన చెప్పారు.

కానీ, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం టీడీపీకి ఇష్టం లేదని  మోడీ విమర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వ్యయాన్ని పెంచుతున్నారని చెప్పారు.పోలవరం ప్రాజెక్టు బాబు సర్కార్‌కు ఓ ఏటీఎంలాంటిదని మోడీ విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్టు నుండి డబ్బులను డ్రా చేస్తూ తమ ఖజానాలో వేసుకొంటున్నాడని ఆయన ఆరోపించారు.

ఐదేళ్ల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసినట్టుగా ఆయన చెప్పారు. పన్ను చెల్లింపుదారుల వల్లే దేశంలోనే అనేక అభివృద్ధి పనులను చేపట్టినట్టుగా ఆయన వివరించారు.

నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వారి వల్లే ఏపీతో పాటు దేశంలో కూడ అభివృద్ధి పనులు సాధ్యమయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఏపీ రాష్ట్రాభివృద్ధికి ఏన్డీఏ  సర్కార్ అన్ని రకాల సహకారం ఇస్తోందని ఆయన చెప్పారు. ట్యాక్స్ పరిధిని పెంచుతూ తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. ఇవాళ్టి నుండి  కొత్త  విధానం అమల్లోకి వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పన్నులను విధించలేదన్నారు. పైగా గతంలో నుండి విధించిన పన్నులను కూడ తగ్గిస్తూ నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన తెలిపారు.


 

click me!