
తన ఇంటిపేరు జేడీ కాదు.. వీవీ అని చెబుతున్నారు జనసేన ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ. సీబీఐ మాజీ జేడీగా విధులు నిర్వర్తించిన ఆయన ఆ తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. కాగా.. వాస్తవానికి ఆయన ఇంటి పేరు వీవీ అయినప్పటికీ.. జేడీగా విధులు నిర్వర్తించడంతో జేడీ లక్ష్మీ నారాయణ అనే అందరికీ గుర్తుండిపోయారు. అయితే.. ఇప్పుడు అదే తన కొంప ముంచుతుందేమోనని ఆయన భయపడుతున్నారట.
ప్రస్తుతం జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆయన ఎన్నికల బరిలో నిలవగా...ఎన్నికల బ్యాలెట్ లో ఆయన పేరు వీవీ లక్ష్మీనారాయణగా ఉంటుంది. దానిని ప్రజలు గుర్తించకపోతే.. ఓట్లు పోయే ప్రమాదం ఉంది. అందుకే ఆయన ముందుగా అప్రమత్తమై.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
తన పేరు జేడీ కాదు.. వీవీ అని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు. బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 7లో గాజు గ్లాసు గుర్తు ఉంటుందని... దానిపపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
ఎన్ని్కలకు మరెంతో దూరం లేకపోవడంతో.. ప్రచారాన్ని ఇంకాస్త విస్తృతం చేయనున్నామని చెప్పారు. స్థానిక సమస్యలకు స్పష్టమైన అవగాహనతో
మోనిఫోస్టో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.