
విజయవాడ: రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించడం ఖాయమని బీఎస్పీ అధినేత్రి మాయావతి జోస్యం చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు సీఎం అయ్యే అర్హత ఉందన్నారు. ఆ పదవికి అర్హుడంటూ చెప్పుకొచ్చారు.
విజయవాడలోని సింగ్ నగర్ లో జనసేన పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ఏపీ ఎన్నికల్లో జనసేన కూటమికి మద్దతివ్వండని ప్రజలకు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ను సీఎం కావాలని తనతోపాటు ఏపీ ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు.
ఇప్పటి వరకు పాలించిన ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయలేదన్నారు. మరోవైపు బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీని బీజేపీ మోసం చేసిందన్నారు. ఈసారి బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు.
మోదీ చౌకీదార్ కాదు చోరీదార్ అంటూ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలను మోదీ భ్రష్టుపట్టించారని మాయావతి ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాల్లో ఈడీ, ఇన్ కమ ట్యాక్స్ అధికారులతో దాడులు చేయిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని మాయావతి ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
నాలాంటి వాళ్లు రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోతున్నారు: పవన్ కళ్యాణ్
ఏపీలో మేం గెలుస్తాం, పవన్ సీఎం: విశాఖలో మాయావతి