కేసీఆర్ సైకిల్ చైన్ తెంచేశాడు: టీడీపీపై పవన్ వ్యాఖ్యలు

Published : Mar 28, 2019, 04:06 PM IST
కేసీఆర్ సైకిల్ చైన్ తెంచేశాడు: టీడీపీపై పవన్ వ్యాఖ్యలు

సారాంశం

సైకిల్ పాతపడిపోయింది... కేసీఆర్ సైకిల్‌ చైన్‌ను తెంచేశారని జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  టీడీపీపై విరుచుకుపడ్డారు


మదనపల్లె: సైకిల్ పాతపడిపోయింది... కేసీఆర్ సైకిల్‌ చైన్‌ను తెంచేశారని జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  టీడీపీపై విరుచుకుపడ్డారు. రాజకీయాలు  రెండు కుటుంబాలకేనా అని జగన్ , చంద్రబాబు కుటుంబాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

గురువారం నాడు చిత్తూరు జిల్లా మదనపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.  వైసీపీని చూస్తే టీడీపీ భయపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీని ఎదుర్కోవడానికి జనసేనే కరెక్ట్ అన్నారు.

తాను ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాలంటే బహిరంగంగా చెబుతానన్నాను. జగన్ మాదిరిగా వెళ్లి మోడీ కాళ్లు పట్టుకోనని ఆయన విమర్శించారు. శాసనసభకు వెళ్లని ప్రతిపక్ష నాయకుడు మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. 
 

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్