మరో తప్పు: విశాఖ ఎయిర్ పోర్ట్ ని వైకాపా ఎయిర్ పోర్టు చేసిన లోకేష్

Published : Mar 28, 2019, 02:33 PM ISTUpdated : Mar 28, 2019, 02:35 PM IST
మరో తప్పు: విశాఖ ఎయిర్ పోర్ట్ ని వైకాపా ఎయిర్ పోర్టు చేసిన లోకేష్

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ మంగళగిరి అభ్యర్థి లోకేష్ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు.


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ మంగళగిరి అభ్యర్థి లోకేష్ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. మంగళగిరి టికెట్ లోకేష్ కి కేటాయించిన నాటి నుంచి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

అయితే...ప్రచారంలో పాల్గొన్న ప్రతిసారీ.. లోకేష్ ఏదో మాట్టాడబోయి.. ఇంకేదో మాట్లాడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు టంగ్ స్లిప్ అయిన లోకేష్.. తాజాగా మరోసారి నోరు జారారు. విశాఖ ఎయిర్ పోర్టుని ఏకంగా వైకాపా ఎయిర్ పోర్టు గా మార్చేశారు.

విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో బుధవారం లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడిపై లోకేష్ సెటైర్ వేసేందుకు ప్రయత్నించారు. కాగా.. ఆ క్రమంలో విశాఖ ఎయిర్ పోర్టుని వైకాపా ఎయిర్ పోర్టు చేశారు. కాగా.. లోకేష్ కామెంట్స్ కి సొంత పార్టీ నేతలు నవ్వుకోవడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్