తెలంగాణలో ఆంధ్రావాళ్లను కొడుతున్నారు.. పవన్ కామెంట్స్

Published : Mar 22, 2019, 04:21 PM IST
తెలంగాణలో ఆంధ్రావాళ్లను కొడుతున్నారు.. పవన్ కామెంట్స్

సారాంశం

తెలంగాణకు వెళ్తే ఆంధ్రా వాళ్లను కొడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. 

తెలంగాణకు వెళ్తే ఆంధ్రా వాళ్లను కొడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంల భాగంగా శుక్రవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

రాష్ట్రవిభజన పరిస్థితులను ఆయన వివరించారు. రాజకీయాలు కులాలతో ముడిపడకూడదని అన్నారు. గొడవలు లేని భీమవరాన్ని తయారు చేస్తాన్నారు. తాను నడిచే నాయకుడినికాదని, ప్రజల సేవకుడినని అన్నారు. 

ప్రేమతో, సహనంతో దేన్నయినా జయించవచ్చునని, అందుకే తాను భీమవరం నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు. భావజాలంతో రాజకీయం ముడిపడాలని, కులంతో ముడిపడిన రాజకీయం చేయకూడదని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్