డబ్బుతో మిమ్మల్ని కొనాలని చూస్తున్నారు జాగ్రత్త:చంద్రబాబు

Siva Kodati |  
Published : Apr 07, 2019, 02:28 PM IST
డబ్బుతో మిమ్మల్ని కొనాలని చూస్తున్నారు జాగ్రత్త:చంద్రబాబు

సారాంశం

ఇకపై ప్రతి సంవత్సరం ఆడపడుచులకు పసుపు-కుంకుమ అందిస్తానని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఇకపై ప్రతి సంవత్సరం ఆడపడుచులకు పసుపు-కుంకుమ అందిస్తానని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివాకం కృష్ణాజిల్లా నందిగామలో జరిగిన బహిరంగసభలో సీఎం పాల్గొన్నారు.

ఉదయం ప్రచారానికి బయలుదేరుతుంటే ఎక్కడికి వెళుతున్నావంటూ దేవాన్ష్ అడిగాడని.. వాడికి ఎన్నికల ప్రచారం అని చెప్పి.. నా కష్టం తనకి కూడా తెలియాలన్న ఉద్దేశ్యంతో ఇక్కడికి తీసుకొచ్చినట్లు సీఎం తెలిపారు.  

దేవాన్ష్ ఒక్కడే తన మనవడు కాదని.... రాష్ట్రంలో ఉండే పిల్లలంతా తన మనవడు, మనవరాళ్లేనని చంద్రబాబు స్పష్టం చేశారు.   పండుగ వేళ రెండు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

జగన్ ఎంబీఏ చేసి ఇప్పుడు బీకాం రాసుకుంటున్నారని.... నరేంద్రమోడీ డిగ్రీ ఏ యూనివర్సిటీలో చేశారో చెప్పరని.. తాను మాత్రం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ చదివానన్నారు.

అమరావతి అభివృద్ధి అయితే హైదరాబాద్ ఎత్తిపోతుందని కేసీఆర్ భయపడుతున్నారని.. అందుకే అమరావతిని అణగదొక్కాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల్లో వైసీపీ నేతలు డబ్బును వెదజల్లుతున్నారని.. డబ్బుతో ఓటర్లను కొనాలని చూస్తున్నారని.. వారి కుట్రలను తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్