ఎన్నికల ప్రచారంలో..చంద్రబాబుకి షాక్ ఇచ్చిన జేసీ

Published : Apr 09, 2019, 02:11 PM IST
ఎన్నికల ప్రచారంలో..చంద్రబాబుకి షాక్ ఇచ్చిన జేసీ

సారాంశం

ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపురంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు.

 కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన తనకు ఆ పార్టీపై మమకారం ఇంకా చావలేదన్నారు. అందుకే తాను ఇలా మాట్లాడుతున్నానని తన మనసులోని మాటను చెప్పారు. హిందీ రాకపోవడం వల్ల ఎంపీగా ఫెయిల్‌ అయ్యానని అంగీకరించారు. తన కుటుంబం గద్వాల్‌ నుంచి వలస వచ్చిన మాట వాస్తవమేనని, తన స్థానికతను ప్రశ్నించొద్దని కోరారు.

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్