జగన్‌కు డ్రైవింగ్ సీటిస్తే యాక్సిడెంట్లు చేస్తారు: నారా లోకేశ్

Siva Kodati |  
Published : Mar 20, 2019, 01:20 PM IST
జగన్‌కు డ్రైవింగ్ సీటిస్తే యాక్సిడెంట్లు చేస్తారు: నారా లోకేశ్

సారాంశం

ఎలాంటి పరిపాలనా అనుభవం లేని వ్యక్తికి రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగిస్తే యాక్సిడెంట్‌లు అవుతాయన్నారు మంత్రి నారాలోకేశ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలో జరిగిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు

ఎలాంటి పరిపాలనా అనుభవం లేని వ్యక్తికి రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగిస్తే యాక్సిడెంట్‌లు అవుతాయన్నారు మంత్రి నారాలోకేశ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలో జరిగిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు.

వచ్చే ఎన్నికల్లో తాను గెలిస్తే భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూసేలా అభవృద్ధి చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. సైబరాబాద్ తరహాలో మంగళగిరిలో ఐటీ పరిశ్రమను విస్తారింపజేస్తానని ఆయన తెలిపారు.

పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీని నిలదీసిన ఏకైక వ్యక్తి గల్లా జయదేవ్ ‌అని ఆయనకు మరోసారి ఓటేయ్యాలని లోకేశ్ అభ్యర్ధించారు. ప్రధానిని ప్రశ్నించినందుకు జయదేవ్‌తో పాటు ఆయన బావమరిది, హీరో మహేశ్ బాబు పైనా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. 
 

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్