పసుపు-కుంకుమలు తుడిచేసేవారికి ఓటు వేస్తారా? లోకేష్ కామెంట్స్

Published : Mar 27, 2019, 02:42 PM ISTUpdated : Mar 27, 2019, 02:44 PM IST
పసుపు-కుంకుమలు తుడిచేసేవారికి ఓటు వేస్తారా? లోకేష్ కామెంట్స్

సారాంశం

ఏపీ మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్.. ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. 

ఏపీ మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్.. ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. బుధవారం లోకేష్ విశాఖపట్నం జిల్లా అరకులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్ లపై మండిపడ్డారు.

విభజన హామీలపై ప్రధాని నరేంద్రమోదీ నమ్మించి మోసంం చేశారని లోకేష్ ఆరోపించారు. జగన్ పేరు ఇక నుంచి కల్వకుంట్ల జగన్ మోదీ రెడ్డి అని అన్నారు. పసుపు-కుంకుమలు ఇచ్చేది చంద్రబాబు అయితే.. పసుపు కుంకుమలను తుడిచేసే  వ్యక్తి జగన్ అని అన్నారు. అలాంటి జగన్ కి ఓట్లు వేస్తారా అంటూ ప్రజలను  లోకేష్ ప్రశ్నించారు.

పోలవరాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నించారని అలాంటి కేసీఆర్ తో జగన్ అంటకాగుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్