మన సెక్యూరిటీ కావాలి.. మన విచారణ వద్దంట: జగన్‌పై లోకేశ్ ఫైర్

Siva Kodati |  
Published : Mar 27, 2019, 01:46 PM IST
మన సెక్యూరిటీ కావాలి.. మన విచారణ వద్దంట: జగన్‌పై లోకేశ్ ఫైర్

సారాంశం

కోడి కత్తి నాటకంలో స్క్రిప్ట్ రాసింది కేంద్రప్రభుత్వమని.. యాక్షన్ విశాఖ ఎయిర్‌పోర్టులో... పోడిచింది జగన్ అభిమాని అంటూ సెటైర్లు వేశారు నారా లోకేశ్. 

కోడి కత్తి నాటకంలో స్క్రిప్ట్ రాసింది కేంద్రప్రభుత్వమని.. యాక్షన్ విశాఖ ఎయిర్‌పోర్టులో... పోడిచింది జగన్ అభిమాని అంటూ సెటైర్లు వేశారు నారా లోకేశ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ జిల్లా అరకులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో లోకేశ్ ప్రసంగించారు.

ప్రతిపక్షనేతకు మన పోలీసుల దర్యాప్తు వద్దు కానీ.. మన పోలీసుల సెక్యూరిటీ కావాలి.. మన పోలీసులు ఎస్కార్ట్‌లుగా రావాలని కానీ వారి విచారణ మాత్రం వద్దన్నారని ఎద్దేవా చేశారు. 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్‌లు రావడం లేదని జగన్ ప్రసంగిస్తున్న సమయంలోనే ఆయన పక్క నుంచే 108 వచ్చిందని దాంతో వైసీపీ అధినేతకు పట్టరాని కోపం వచ్చిందని లోకేశ్ ధ్వజమెత్తారు.

మన రాజధాని అమరావతి అయితే జగన్‌కు హైదరాబాద్‌లో పనేంటి అంటూ ప్రశ్నించారు. బాక్సైట్ అక్రమ మైనింగ్‌ను చంద్రబాబు రద్దు చేశారని గుర్తు చేశారు. ప్రత్యేకహోదాతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నిలబెట్టుకుంటారో వారికే కేంద్రంలో చంద్రబాబు మద్ధతునిస్తారని లోకేశ్ స్పష్టం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్