రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా.. ఆ రెండు వర్గాల వాళ్లదే రాజ్యం: పవన్

Siva Kodati |  
Published : Mar 31, 2019, 04:01 PM ISTUpdated : Mar 31, 2019, 04:02 PM IST
రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా.. ఆ రెండు వర్గాల వాళ్లదే రాజ్యం: పవన్

సారాంశం

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అధికారం రెండు వర్గాల మధ్యే నలుగుతోందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అధికారం రెండు వర్గాల మధ్యే నలుగుతోందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలో జరిగిన సభలో ప్రసంగించారు.

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు శ్రీకాకుళాన్ని వాడుకున్నాయి గానీ అభివృద్ధి చేయలేదని పవన్ మండిపడ్డారు. ఈ ప్రాంతంలో 60 శాతం ఓట్లు అచ్చెన్నాయుడు తీసుకుంటే.. మిగిలిన 40 శాతం ధర్మాన ప్రసాదరావు ఖాతాలోకి వెళ్తున్నాయని జనసేనాని ధ్వజమెత్తారు.  

అల్లరి చిల్లరగా ఉన్న వాళ్ల వల్లే ఉత్తరాంధ్ర వెనుకబడిందని... ఈ ప్రాంతంలో జనసేనకు సీట్లు రాకపోతే పోరాటం చేసే వాళ్లు ఉండరని పవన్ తెలిపారు. కుటుంబ పాలనలో నలిగిపోతున్న శ్రీకాకుళాన్ని రక్షించాలనే తపనతో చదువుకున్న అభ్యర్థులను పోటీలో ఉంచానని వారిని గెలిపించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. 

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్