పవన్‌ను నమ్ముకొంటే అత్తారింటికే: చంద్రబాబు

By narsimha lodeFirst Published Apr 2, 2019, 2:36 PM IST
Highlights

పవన్ పార్టీని నమ్ముకొంటే అత్తారింటికి పోతారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. తనను నమ్ముకొంటే మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతానని ఆయన చెప్పారు.

మదనపల్లె:  పవన్ పార్టీని నమ్ముకొంటే అత్తారింటికి పోతారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. తనను నమ్ముకొంటే మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతానని ఆయన చెప్పారు.

చిత్తూరు జిల్లా మదనపల్లిలో మంగళవారం నాడు నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు తిరుమలను  కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని కుట్రపన్నారని బాబు ఆరోపించారు. తిరుమల వెంకటేశ్వరస్వామితో పెట్టుకొన్న వారేవరూ బాగుపడలేదన్నారు.తిరుమల తిరుపతి ఆంధ్రుల ఆస్తి అని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రానికి మోడీ అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది అంటూ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోద్రాలో వందల మందిని పొట్టనబెట్టుకొన్నారని బాబు ఆరోపించారు.ఓట్ల దొంగలను మోడీ కాపాడారని చంద్రబాబు విమర్శించారు. దేశంలో మోడీ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.

పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వలేదన్నారు.మేం కష్టకాలంలో ఉంటే మీరు వచ్చారా అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. మోహన్ బాబు, జయసుధ,  అలీ ఎక్కడి నుండి వస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అందరినీ బెదిరించి పంపిస్తున్నాడని చంద్రబాబునాయుడు ఆరోపించారు.

హైద్రాబాద్‌లో ఇంతకాలం ఉంటూ కేసీఆర్‌కు ఊడిగం చేసుకోవాలని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు కష్టకాలంలో ఉన్న సమయంలో సినీ నటులు ఎందుకు రాలేదో చెప్పాలని బాబు ప్రశ్నించారు.వలసపక్షులు ఏపీపై పడ్డాయని సినీనటులు వైసీపీ తరపున ప్రచారం చేయడంపై బాబు వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

హుదూద్ లాంటి విపత్తులు వచ్చిన సమయంలో కరువు వచ్చిన సమయంలో సినీ నటులు ఎందుకు రాలేదో చెప్పాలన్నారు.హైద్రాబాద్‌లో ఉంటూ కేసీఆర్‌కు ఊడిగం చేసుకోవాలని బాబు ప్రశ్నించారు.

జగన్ ఇవాళ లోటస్‌పాండ్‌లో కూర్చొని కుట్రలు చేస్తున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. జగన్ కు ఒక్కసారి అధికారం అప్పగించడానికి ఇదేమైనా చాక్లెట్టా అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకొన్నట్టు చంద్రబాబు చెప్పారు. సుమారు 30 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని బాబు హామీ ఇచ్చారు. 


 

click me!