ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలకు చేదు అనుభవం

Published : Apr 02, 2019, 11:41 AM IST
ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలకు చేదు అనుభవం

సారాంశం

ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీడీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది.

ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీడీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. వచ్చే ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని అడిగిన టీడీపీ నేతలను ఓ మహిళ నిలదీసింది. ఈ సంఘటన తిరుమలలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఎన్నికలు మరెంతో దూరంలో లేకపోవడంతో టీడీపీ నేతలు ప్రచారం వేగవంతం చేశారు. సోమవారం కొందరు నేతలు ముందుగా స్థానిక వినాయకస్వామి ఆలయ దర్శనార్థం వెళ్లగా అక్కడ కొందరు మహిళలు వారిని సమస్యలపై నిలదీశారు.  తిరుమలలో స్థానిక సమస్యలు తీర్చకుండా ఓట్లు అడగడానికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని మండిపడ్డారు.

తమకు న్యాయం చేయని పార్టీకి ఓట్లు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో నేతలు అవాక్కయ్యారు. పేదవాళ్లకు ఎలాంటి న్యాయం జరగడం లేదని నిరసించారు. తిరుమలలో నివసిస్తున్న తమకు ఎలాంటి బతుకుదెరువు లేదని, టీటీడీలో కూడా ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని వాపోయారు. 
 

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్