కేసీఆర్‌ను చూస్తే సినీ నటులు ఉచ్ఛ పోసుకొంటున్నారు: బాబు తీవ్ర వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Apr 2, 2019, 4:33 PM IST
Highlights

సినీ నటులు చుట్టుచూపుగా హైద్రాబాద్ నుండి ఏపీకి వస్తే సంతోషమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. కానీ, ఇక్కడికొచ్చి రాజకీయాలు చేయడం, పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తే ఎవరిని కూడ వదిలిపెట్టనని బాబు హెచ్చరించారు.
 


చంద్రగిరి:  సినీ నటులు చుట్టుచూపుగా హైద్రాబాద్ నుండి ఏపీకి వస్తే సంతోషమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. కానీ, ఇక్కడికొచ్చి రాజకీయాలు చేయడం, పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తే ఎవరిని కూడ వదిలిపెట్టనని బాబు హెచ్చరించారు.

మంగళవారం నాడు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల సభలో పాల్గొన్నారు. హైద్రాబాద్‌లో ఉంటూ కేసీఆర్‌కు ఊడిగం చేసుకోవాలని ఆయన సినీ నటులపై బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌ను చూస్తే సినీ నటులు ఉచ్ఛ పోసుకొంటున్నారని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలు కష్టాలు ఉన్న సమయంలో ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. చుట్టపు చూపుగా వస్తే తనకు అభ్యంతరం లేదన్నారు. హైద్రాబాద్‌లో ఉంటూ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డారన్నారు. షాపింగ్‌లకు అధిక సమయాన్ని కేటాయిస్తారని బాబు గుర్తు చేశారు.

కేసీఆర్ భయానికి సినీనటులు ఏపీపై పడ్డారని బాబు అభిప్రాయపడ్డారు.  ఏపీకి వచ్చి ఆట ఆడితే చూస్తూ ఊరుకోనని బాబు హెచ్చరించారు. చంద్రగిరి ఎమ్మెల్యే రౌడీయిజం చేస్తున్నాడని బాబు విమర్శించారు. ఈ ప్రాంతంలో పోలీసులు సరిగా వ్యవహరించలేదన్నారు. తాను ప్రజాస్వామ్యబద్దంగానే వ్యవహరిస్తానని బాబు చెప్పారు. రౌడీయిజాన్ని ధైర్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ ప్రజలను కుక్కలు అంటూ హీనంగా తిట్టిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. అలాంటి కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కయ్యారని బాబు విమర్శించారు. జగన్ కేరాఫ్ అడ్రస్ లోటస్ పాండ్  అన్నారు. ఇవాళ లోటస్‌పాండ్‌లో కూర్చొని జగన్ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

పోలవరంపై కేసీఆర్ కేసులు వేశాడని ఆయన చెప్పారు. భద్రాచలం మునిగిపోతోందని కేసీఆర్ చెబుతున్నాడన్నారు. భద్రాచలం కూడ గతంలో ఏపీ రాష్ట్రంలోనే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.భద్రాచలం మాది అంటూ బాబు తేగేసి చెప్పారు.

పులివెందులలో జగన్ ట్యాక్స్ ఉందన్నారు. పులివెందుల నియోజకవర్గంలో తన సభకు అపూర్వ స్పందన వచ్చిందన్నారు. పులివెందులలో కూడ మనం కూడ గెలుస్తామన్నారు. పులివెందులకు  నీళ్లు  ఇవ్వాలనే ఆలోచన జగన్‌కు రాలేదన్నారు. 

పవన్ కళ్యాణ్‌కు ఓటేస్తే అత్తారింటికే దారి వస్తోందన్నారు. జగన్‌కు ఓటేస్తే మోడీకి ఓటేసినట్టేనని బాబు చెప్పారు. తనకు అన్ని దారులు తెలుసునని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

పవన్‌ను నమ్ముకొంటే అత్తారింటికే: చంద్రబాబు


 

click me!