48 పేజీల్లో 31 కేసులు, ఇదీ జగన్ చరిత్ర: చంద్రబాబు

By telugu teamFirst Published Mar 23, 2019, 11:35 AM IST
Highlights

హత్యారాజకీయాలు చేసేవారికి ఎవరైనా ఓటు వేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. శనివారం ఎలక్షన్ మిషన్‌పై సీఎం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐదేళ్ల మన కృషికి తగిన ప్రజాదరణ సభల్లో కనిపిస్తోందని అన్నారు. 

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ నామినేషన్ పత్రాలకు జత చేసిన అఫిడవిట్ పై ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. జగన్ దాఖలు చేసిన 48 పేజీల పత్రాల్లో 31 కేసులు ఉన్నాయని, జగన్ చరిత్ర ఇదీ అని ఆయన అన్నారు.

హత్యారాజకీయాలు చేసేవారికి ఎవరైనా ఓటు వేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. శనివారం ఎలక్షన్ మిషన్‌పై సీఎం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐదేళ్ల మన కృషికి తగిన ప్రజాదరణ సభల్లో కనిపిస్తోందని అన్నారు. ఈ 12 రోజులు ఉధృతంగా ప్రచారం చేయాలని నేతలకు సూచించారు. 

మన అభివృద్ధి-సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకుని వెళ్లాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ గెలుపు ఏకపక్షం కావడంతో ప్రతిపక్షానికి దిమ్మతిరుగుతోందని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కేసీఆర్‌ చెడగొడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. 

హైదరాబాద్‌లో ఆస్తులున్నవారిపై వేధింపులు, బెదిరింపులకు దిగుతున్నారని, చివరికి అధికారులను కూడా బెదిరించడానికి దిగజారారని ఆయన  ఆయన అన్నారు. తెలంగాణ కన్నా ఏపీ ఎదుగుతుందనే అక్కసు కేసీఆర్‌దని, గుజరాత్‌ను ఏపీ మించిపోతుందనే కక్ష మోడీదని, టీడీపీ ఎక్కడ శాశ్వతంగా అధికారంలో ఉంటుందో అనే అక్కసు జగన్‌దని చంద్రబాబు విమర్శించారు. 

ఈ ముగ్గురూ కక్షకట్టి ఏపీపై, టీడీపీపై ముప్పేట దాడి చేస్తున్నారని అన్నారు. 25 ఎంపీ సీట్లు, 150 అసెంబ్లీ సీట్లలో టీడీపీనే గెలిపించాలని పిలుపు ఇచ్చారు. ఆంధ్రా ద్రోహులకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

click me!