కిందికి దిగి మరీ...అభిమానిపై చేయి చేసుకున్న బాలకృష్ణ

By telugu teamFirst Published Apr 8, 2019, 7:43 AM IST
Highlights

చైతన్యరథం ముందు కొందరు అభిమానులు ఉత్సాహంగా నినాదాలు చేస్తున్నారు. మరికొంత మంది ముందుభాగంలో ఉండే ఐరన్‌పై వేలాడారు. వాహనం ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో బాలకృష్ణకు కోపం వచ్చింది.

విజయనగరం: నందమూరి హీరో, హిందూపురం శానససభ్యుడు బాలకృష్ణ తాజాగా మరో అభిమానిపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా చీపురుపలిలో ఆదివారం మధ్యాహ్నం రోడ్‌ షో ఆ సంఘటన చోటుచేసుకుంది. 

చైతన్యరథం ముందు కొందరు అభిమానులు ఉత్సాహంగా నినాదాలు చేస్తున్నారు. మరికొంత మంది ముందుభాగంలో ఉండే ఐరన్‌పై వేలాడారు. వాహనం ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో బాలకృష్ణకు కోపం వచ్చింది.

వెంటనే కిందకి దిగి ఓ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. ఆ తర్వాత వెంటనే వాహనంపైకి ఎక్కి అభిమానులనుద్దేశించి ప్రసంగించారు.  పార్టీ నాయకుడు త్రిమూర్తుల రాజు జోక్యం చేసుకుని ఆ అభిమానికి సర్దిచెప్పారు.

click me!